HMPV Virus కి వాక్సిన్ లేదు చికిత్స లేదు తేల్చిచెప్పిన అమెరికా | What is HMPV Virus

what is hmpv virus

మరోసారి భయంకరమైన HMPV Virus వ్యాప్తి చెందబోతుందా?

చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఎంత పెద్ద విధ్వంసం సృష్టించిందో ప్రపంచం మొత్తం చూసింది అలాంటి వైరస్ HMPV Virus మళ్ళి రాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంత అనేది చూస్తే

చైనా లో HMPV అనే వైరస్ 14 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలకు ఎక్కువగా సోకుతుంది అని చైనా మీడియా ప్రచారం చేస్తుంది, ఈ వైరస్ వల్ల ముక్యంగా తీవ్రమైన జలుబు వొస్తుంది అని దానితో ఎక్కువ మంది ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు అనే కథనాలు చైనా లో ప్రచారం అవుతున్నాయి

what is hmpv virus

What is hmpv virus

HMPV వైరస్ అంటే human metapneumovirus ఇది ఊపిరితిత్తుల మీద దాడి చేసే వైరస్ లకు చెందిన రకం, దీన్ని ఒకరకంగా
seasonal virus అని కూడా అంటారు అంటే కాలాన్ని బట్టి వొస్తూ ఉంటుంది,

దీన్ని 2001 లో గుర్తించారు, అమెరికా లో దాదాపు ప్రతీ సంవత్సరం 20 వేలకు పైగా 5 సంవత్సరాల లోపు పిల్లలు ఈ వైరస్ వల్ల హాస్పిటల్ లో చేరుతుంటారు

ఈ వైరస్ సోకిన వారికి తీవ్రమైన జలుబు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకొని పోవడం, ఊపిరి తీసుకోవడం లో ఇబ్బంది పడడం
ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లల్లో అలాగే ముసలి వాళ్ల మీద ఈ వైరస్ చాలా తొందరగా దాడి చేస్తుంది

ఈ HMPV Virus వల్ల భయపడాల్సిన అవసరం ఉందా ?

ఈ వైరస్ గురించి జాగ్రత్త తీసుకోకపోతే తప్పకుండా భయపడాల్సి వొస్తుంది, ముక్యంగా పసి పిల్లల నుండి 5 ఏళ్ళ లోపు పిల్లలు దీనికి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతారు, 2000 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఈ వైరస్ లో మార్పులు ఏవీ రాలేదు అని దీని తీవ్రత అదే స్థాయి లో ఉంది అని virologist లు చెప్తున్నారు

SpaDeX
ఇస్రో విజయవంతంగా SpaDeX Docking ప్రక్రియను పూర్తి చేసింది

చైనా లో పరిస్థితి ?

December 26 వ తేదీన చైనా officials ఒక ప్రకటన చేసారు, 14 ఏళ్ళ లోపు పిల్లలో ఈ వైరస్ ఎక్కువ స్థాయి లో పెరుగుతుంది అని
China CDC’s National Institute for Communicable Disease Control and Prevention కి చెందిన , Kan Biao, అనే అధికారి వెల్లడించడం జరిగింది, కానీ అది ఏ స్థాయిలో ఉందో చైనా ఇక బైటికి చెప్పడం లేదు

దీనికి వాక్సిన్ ఉందా ?

ప్రస్తుతానికి ఈ వైరస్ ని హరించే వాక్సిన్ అందుబాటులో లేదు, అమెరికా కి చెందిన Disease కంట్రోల్ అండ్ prevention డిపార్ట్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఈ వైరస్ సోకిన వారికి antiviral treatment కూడా ఇప్పటివరకు లేదు అని చెప్పుకొచ్చింది

దీని నుండి బయటపడడానికి కరోనా వైరస్ కు తీసుకున్నట్టుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది

ఎందుకంటే ఈ వైరస్ కూడా గాలిలో వ్యాపిస్తుంది

The CDC recommends the following:
( U.S Disease control and prevention )

==> కాబట్టి తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి
==> చేతులతో కంటిని ముక్కును నోటిని ముట్టుకోవడం చేయరాదు
==> జబ్బు పడిన వారికి దూరంగా ఉండాలి
==> మాస్క్ ను తప్పకుండా ధరించాలి
==> ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *