orange cave crocodiles :
కోట్ల సంవత్సరాలలో మొదటిసారి పరిణామం చెందుతున్న మొసళ్ళు ?
భూమి మీద ప్రతీ జంతువు ఒకప్పుడు నీటిలో నివసించేది అక్కడ నుండి నేల మీదకి నెమ్మదిగా పాకుతూ వొచ్చి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త జాతులుగా పరిణామం చెందుతూ వొచ్చాయి, దీనికే జీవపరిణామ సిద్ధాంతం అని పేరు
కానీ కొన్ని వొందల సంవత్సరాలుగా మనం చెప్పుకున్న జీవ పరిణామం అనేది అన్ని జంతువులలో ఆగిపోయింది దానికి కారణాలు
కేవలం భూమి మీద మారుతూ వొస్తున్న వాతావరణ మార్పులతో పాటు ఆహార గొలుసు అనేది జంతువులకు ఆ అవసరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి
కాబట్టి ఆహార కొరత భూ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత కాలం జీవం పరిణామం ఆగిపోతుంది
కొన్ని లక్షల సంవత్సరాలుగా దాదాపు అన్ని జంతువులు పరిణామం చెందుతూ వొచ్చాయి కానీ కోట్ల సంవత్సరాల నుండి పరిణామం చెందకుండా అలాగే ఉంటున్న జివి ఏదైనా ఉంది అంటే అది మొసలి మాత్రమే అని చెప్పుకోవాలి
ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల తో కలిసి జీవించినప్పుడు మొసళ్ళు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి
ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొసళ్ళు డైనోసార్ ల కంటే ప్రాచీనమైనవి కాకపోతే ఆ కాలం లోని మొసళ్ళు
భారీ పరిమాణం లో ఉండేవి ఒక్కో మొసలి దాదాపు 10 మీటర్ల పొడవు ఉండేవి మనకు దొరికిన శిలాజాల ప్రకారం 8 కోట్ల సంవత్సరాల క్రితం నాటి మొసలి శిలాజాలు North America లో లభ్యమయ్యాయి
వీటికి అరటిపండు సైజు లో దంతాలు ఉండడం వల్ల డైనోసార్ లను కూడా వేటాడి చంపి తినేవి అని కనుక్కున్నారు
అలాంటి మొసళ్ళు ఇప్పుడు కొత్త జీవులుగా పరిణామం చెందుతున్నాయి అని కనుక్కున్నారు
orange cave crocodiles
ఆఫ్రికా ఖండం లోని Gabon అనే దేశంలో దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతం లోని కొన్ని గుహలలో వేల సంవత్సరాలుగా మొసళ్ళు జీవిస్తున్నాయి, అయితే వాటిని వేటాడినప్పుడు అందులో కొన్ని ఆరెంజ్ రంగు లో కనిపించాయి
దీనికి కారణం ఆ మొసళ్ళు గుహలో జీవిస్తూ అక్కడ ఉండే గబ్బిలాలను తింటూ గడుపుతున్నాయి దానివల్ల వాటి తోలు ఆరెంజ్ రంగులోకి మారిపోయింది అని కనుక్కున్నారు
అయితే ఇవి ఆరంజ్ రంగులోకి మారడానికి అక్కడ ఎక్కువగా ఉండే యూరియా కూడా కారణం అని biologist లు తెలిపారు
chemical బ్లీచింగ్ వల్ల వాటి రంగులో పూర్తిగా మార్పు సంభవించింది
అంతే కాదు వాటి జెనెటిక్స్ లో కూడా మార్పు వొచినట్టు తెలుస్తుంది, అడవిలో నివసించే మొసళ్ళకు , ఈ గుహలో నివసించే మొసళ్లకు మధ్య చాలా వరకు మార్పులు వొచినట్టుగా గుర్తించారు అంటే అవి mutation చెందుతున్నాయి
పూర్వం ఎలా అయితే మనుషులు వివిధ ప్రాంతాలకు విస్తరించి వివిధ జాతులుగా పరిణామం చెందారో సరిగ్గా ఇప్పుడు మొసళ్ళు చీకటి గుహలలో జీవించడం వల్ల ఒక కొత్త జీవిగా పరిణామం చెందుతుంది
ప్రకృతిలో ఇది సహజమైన మార్పే కానీ మొసళ్ళకు ఇది అరుదైన విషయం
భవిష్యత్తులో ఇవి ఆరంజ్ రంగులో ఉండే జీవులుగా పూర్తిగా మారిపోతాయి
అయితే ఇవి మరుగుజ్జు మొసళ్ళు అంటే చాలా చిన్నగా దాదాపు 2 మీటర్ల కంటే చిన్నగా ఉంటాయి 1. 5 మీటర్ల పొడవు ఉంటె అవి పెద్ద మొసలిగా పరిగణిస్తారు, అందుకే వీటని గుహలలో నివసించే orange dwarf cave crocodiles అని అంటారు
స్థానికంగా ఉండే ఆఫ్రికన్లు ఈ మొసళ్ళు ఉండే గుహలోపలికి వెళ్ళడానికి బయపడతారట, అయినా సరే పరిశోధకులు దైర్యంగా లోపలి వెళ్లి వాటిని అధ్యయనం చేశారు
ఈ మొసళ్ళకు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంటుందట ఎందుకంటే మిగతా మొసళ్ల మాంసం కంటే ఈ మరుగుజ్జు యెర్ర మొసళ్ల మాంసం రుచిగా ఉంటుందట, అలాగే మిగతా మొసళ్ళతో పోలిస్తే ఇవి అంత క్రూరంగా ప్రవర్తించవట
అందుకే వీటిని కాపాడడానికి అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది , పరిణామం చెందే దశలో ఉన్న మొసళ్ళు కాబట్టి వీటిని International Union for Conservation of Nature వాళ్ళు దీన్ని Red లిస్ట్ లో పెట్టారు