Mars హెలికాఫ్టర్ కూలిపోయినా సరే 20 ఏళ్ళ పాటు అద్భుతం చేయబోతుంది
నాసా మార్స్ మీదకి రోవర్ లను పంపించింది అని మనకు తెలుసు కానీ రోవర్ తో పాటు ఒక చిన్న హెలికాఫ్టర్ ను కూడా పంపించింది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు
Perseverance అనే రోవర్ తో పాటు 2020 లో మార్స్ కి వెళ్లిన హెలికాఫ్టర్ పేరు Ingenuity
అయితే ఈ హెలికాఫ్టర్ మార్స్ మీద ఎగురుతూ Perseverance రోవర్ కు కొన్ని సమయాల్లో దారి చూపిస్తుంది దూరం లో ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో చెప్తుంది
మార్స్ మీద పైకి ఎగిరిన మొట్టమొదటి హెలికాఫ్టర్ గా దీని పేరు చరిత్రలో నిలిచిపోతుంది
మార్స్ మీద ఇది దాదాపు 71 సార్లు గాలిలోకి ఎగిరింది కానీ దురదృష్టవశాత్తు 72 వ సారి మార్స్ మీద ఎగిరి కిందికి ల్యాండ్ అయ్యేటప్పుడు దానికి ఉన్న రెక్క భాగం ఒకటి విరిగిపోయింది దాంతో అది crash land అయ్యింది
ఈ సంఘటన Jan. 18, 2024, లో జరిగింది, అప్పటి నుండి ఆ హెలికాఫ్టర్ మార్స్ మీద ఒకేదగ్గర ఉండిపోయింది
ఆ తరువాత Feb. 24, 2024, రోజున Perseverance రోవర్ అసలు ఆ హెలికాఫ్టర్ కి ఏం జరిగిందో చూపిస్తూ ఒక ఫోటో తీసింది ఆ ఫోటో లో
దాని రెక్క భాగం దూరంగా పడి ఉండడాన్ని నాసా గుర్తించింది
ఫోటో లో left సైడ్ ఒక చిన్న ముక్క పడి ఉండడాన్ని మనం గమనించవొచ్చు
అయితే ఈ హెలికాఫ్టర్ అనేది అదృష్టవశాత్తు నిలకడగానే మార్స్ నేల మీద నిలబడింది
దానివల్ల అందులో ఉన్న కెమెరాలతో దాని రెక్క భాగం ఎంత damage అయ్యిందో ఫోటో తీసి పంపించింది అది కూడా ఇక్కడ కనిపిస్తున్నట్టు దాని నీడ అనేది మార్స్ నేల మీద పడడంతో ఆ రెక్క నీడను గుర్తించి దాని పరిస్థితిని మనకు చూపించింది
అయితే Mars మీద జరిగిన ఈ సంఘటన గురించి నాసా మొదటి సారి వేరొక ప్రపంచం లోని Aircraft Accident మీద Investigation చేసింది దానికి సంబందించిన వివరాలు డిసెంబర్ 11 వ తేదీన వెల్లడించింది
కానీ ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పడానికి వాళ్లకు సరైన కారణాలు దొరకలేదు ఎందుకంటే ప్రమాదాన్ని వివరించే సరైన navigation system అందులో లేదు కాబట్టి దాన్ని వివరించలేకపోయాం అని investigation టీం చెప్పుకొచ్చింది,
కోట్ల కిలోమీటర్ల దూరం లో హెలీకాఫ్టర్ దగ్గర ఏం జరిగిందో చూసి చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు, అక్కడికి వెళ్లి ప్రతిదీ మనం ముట్టుకొని దాన్ని పరీక్షించడానికి వీలు లేదు మాకు దొరికిన చిన్న చిన్న ఆధారాలతోనే ఆ ప్రమాదాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది,
కాబట్టి దాన్ని మేము అంచనా వేయలేకపోయాం అని investigation టీం చెప్పింది కాకపోతే
దీని వల్ల భవిష్యత్తు లో హెలీకాఫ్టర్లను Mars మీదకి పంపించేటప్పుడు అక్కడ ప్రమాదం జరిగితే ఎలా జరిగిందో తెలుసుకునేలా డేటా collection టెక్నాలజీని improve చేయాలనీ తెలిసి వొచ్చింది అని NASA చెప్పింది
Mars హెలికాఫ్టర్ కూలిపోయినా సరే 20 ఏళ్ళ పాటు అద్భుతం చేయబోతుంది
అయితే ఈ హెలికాఫ్టర్ Mars మీద ఎగరలేకపోయినా సరే దాంట్లో అమర్చిన టెక్నాలజీ తో మార్స్ వాతావరణాన్ని 20 సంవత్సరాల పాటు
రికార్డు చేయగలుగుతుంది అంతే కాదు ప్రతీ రోజు మార్స్ మీద రాత్రి పగలు ఫోటోలు తీస్తుంది
కానీ ఆ డేటా ని Perseverance రోవర్ కి పంపిస్తేనే ఆ రోవర్ భూమి కి పంపిస్తుంది తప్ప హెలికాఫ్టర్ లో ప్రత్యేకంగా భూమిని కాంటాక్ట్ అయ్యే link లేదు, అండ్ Perseverance రోవర్ ఇప్పుడు ఆ హెలికాఫ్టర్ కు 3 కిలోమీటర్ల దూరం లో ఉంది,
కాబట్టి తొందర్లోనే రోవర్ ఇంకా దూరం వెళ్తుంది కాబట్టి ఇంకొన్ని రోజుల్లో హెలికాఫ్టర్ తో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి
కానీ అందులో రికార్డు అయ్యే డేటా అనేది భవిష్యత్తులో Mars మీదకి వెళ్లే వ్యోమగాములకు 20 ఏళ్ళ క్రితం నాటి వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి ఆ డేటా ఉపయోగపడుతుంది అని నాసా చెప్పుకొచ్చింది
మూడేళ్లపాటు సేవలు అందించిన Ingenuity హెలికాఫ్టర్ 5 సార్లు మాత్రమే fly చేయడానికి దాన్ని డిజైన్ చేసారు కానీ అనుకున్నదాని కంటే ఎక్కువసార్లు ఆకాశం లోకి ఎగిరింది
ఎందుకంటే ఇదే మార్స్ మీద మొట్టమొదటి హెలికాఫ్టర్ కాబట్టి ఎలా ఎగురుతుంది? అసలు మార్స్ వాతావరణం లో అది ఎగరగలదా అనే సందేహాలు కూడా NASA కు ఉండేవి
అలాంటి పరిస్థితుల్లో నుండి 71 సార్లు మార్స్ మీద fly చేసింది అంటే గొప్ప విషయం అనే చెప్పుకోవాలి
Thanking you exceedingly for providing such great news,i read this on X but i didn’t understand clearly.
After reading here i’ve understood clearly.