SPADEX తో సంచలనం సృష్టించబోతున్న ISRO

SPADEX

SPADEX ప్రయోగం చంద్రయాన్ 4 కోసమా ?

ఇస్రో చేసిన ప్రయోగాల్లో Chandrayan కి వొచ్చిన పాపులారిటీ కానీ దానికి వోచిన సక్సెస్ కానీ ఇంక దేనికీ రాలేదు
Chandrayan 1 తో మూన్ మీద WATER ని కనిపెట్టడం తో దీని మీద ప్రపంచ దేశాల దృష్టి పడడం మొదలయ్యింది,

అయితే చంద్రయాన్ 3 కి కొనసాగింపుగా చంద్రయాన్ 4 ని కూడా ప్రయోగించబోతున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాధ్ గారు ప్రకటించారు

చంద్రయాన్ 4 తో చంద్రుడి మీద ఉన్న మట్టిని దాదాపు 3 కిలోల వరకు భూమికి తీసుకొని రాబోతున్నట్టు దానికి తగ్గట్టుగా ప్రయోగాలు జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది అందులోనూ

చంద్రుడికి సౌత్ పోల్ లో ఉన్న చంద్రుడి మట్టిని తీసుకొని రావడానికి ఇస్రో ప్రయోగాన్ని రచిస్తుంది

నాసా తో పాటు చైనా కూడా చంద్రుడి మట్టిని భూమి కి తీసుకొచ్చి సక్సెస్ అయ్యాయి కానీ మన ఇస్రో చేయబోతున్న ప్రయోగం లో ఒక ప్రత్యేకత ఉంది

అదేంటంటే సౌత్ పోల్ లో ఇస్రో కనిపెట్టిన మంచు నీటితో కూడిన చంద్రుడి మట్టిని తీసుకురాబోతుంది

ఇప్పటివరకు నాసా కానీ చైనా లేదా ఇతర స్పేస్ ఏజెన్సీ కూడా అలాంటి శాంపిల్ ను సేకరించి తీసుకురాలేదు

ప్రపంచం లో మన ఇస్రో మొట్టమొదటి సారిగా ఈ సాహసం చేస్తుంది , ఇది విజయవంతం అయితే చంద్రుడి మీద ఉన్న నీరు ఎలా ఉంది దాని లక్షణాలు ఏంటి,

ఆ నీరు చంద్రుడిలో ఎంత మేరకు విస్తరించి ఉంది, చంద్రుడి మట్టితో ఆ నీరు ఎలా రియాక్ట్ అవుతుంది

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి

దీనికోసం మన భారత ప్రభుత్వం 21 billion rupees(2100 Cr ) బడ్జెట్ ని కూడా కేటాయించింది

అయితే ఈ చంద్రయాన్ 4 ని 2028 లో లాంచ్ చేయబోతున్నారు అంటే ఇంకో మూడేళ్ళ పాటు దానికోసం మనం ఎదురు చూడాలి
ఈ చంద్రయాన్ 4 కోసం ఇస్రో జపాన్ తో కలిసి పనిచేయబోతుంది

CHANDRAYAN 4

స్పేస్ క్రాఫ్ట్ భాగాలు

దీనికోసం 5 spacecraft modules ని ప్రిపేర్ చేస్తున్నట్టు అలాగే దీనికోసం LVM-3 రాకెట్ ని ఉపయోగించాల్సి ఉంటుంది అని కూడా సోమనాధ్ గారు చెప్పుకొచ్చారు

ఈ ప్రయోగం లో చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడానికి ఒక లాండర్ అందులో నుండి బయటకి వొచ్చి మూన్ శాంపిల్ ని కలెక్టు చేసుకోవడానికి ఒక రోవర్ ఉంటాయి

అయితే ఈ ఆ లాండర్ కి పైన ఒక చంద్రుడి నుండి లిఫ్ట్ ఆఫ్ అయ్యి శాంపిల్ ని భూమికి తీసుకురావడానికి Ascender Module ఉంటుంది

ఈ module అనేది చంద్రుడి నుండి లిఫ్ట్ ఆఫ్ అయ్యి మూన్ ఆర్బిట్ కి చేరుకుంటుంది

మూన్ ఆర్బిట్ లో అప్పటికే transfer module తిరుగుతూ Ascender Module కోసం ఎదురు చూస్తుంది

ఈ Ascender Module అనేది మూన్ ఆర్బిట్ లోకి వెళ్ళాక Transfer module తో docking చేస్తుంది అంటే అనుసంధానం అవుతుంది

అక్కడ నుండి Transfer module తో భూమి కి తిరుగు ప్రయాణం చేస్తుంది

SpaDeX
ఇస్రో విజయవంతంగా SpaDeX Docking ప్రక్రియను పూర్తి చేసింది

CHANDRAYAN 4

అలా భూమికి దగ్గరగ వొచ్చిన తరువాత Transfer Module కి అమర్చబడి ఉన్న Earth Reentry Module ని భూమి మీదకి విడుదల చేస్తుంది
ఈ Reentry Module లోనే చంద్రుడి మీద తీసుకున్న మట్టి ఉంటుంది
అంటే ఒక పెద్ద spacecraft చంద్రుడి మీదకి వెళ్లి చివరిగా ఇలాంటి ఒక reentry module లో చంద్రుడి మట్టి భూమికి వొస్తుంది

chandrayan 4

SPADEX ప్రయోగం

ఇస్రో చైర్మన్ చెప్పిన వివరాల ప్రకారం చంద్రయాన్ 4 ప్రయోగం లో Docking అనే ప్రక్రియ చాలా క్లిష్టతరమైనది అని సోమనాధ్ గారు వివరించారు

Docking అనే ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా చేయడానికి ఎంతో ప్రాక్టీస్ కావాలి దానికోసం ఇస్రో సెపెరేట్ గా SPADEX (Space Docking Experiment) ని అంతరిక్షం లో చేయబోతుంది,

దీనికోసం Chaser’ and the ‘Target అనే రెండు స్పేస్ క్రాఫ్ట్ లను స్పేస్ లోకి పంపించి ఆ రెండిటికి మధ్య Docking ప్రాక్టీస్ చేయబోతున్నారు

Docking ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించే స్పేస్ క్రాఫ్ట్ లను మన హైదరాబాద్ కి చెందిన Ananth Technologies అనే కంపెనీ తాయారు చేసింది రెండూ కలిపి 800 kg ల MASS ఉన్నాయి,

ఈ డాకింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి బాధ్యతలు ఈ ప్రైవేట్ కంపెనీ కె ఇస్రో అప్పగించింది

ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్ లు సెకనుకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతూ అనుసంధానం డాకింగ్ అయ్యేలా దీన్ని రూపొందించారు అని తెలుస్తుంది

వీటిని ఇప్పటికే శ్రీహరికోటకు పంపించడం కూడా జరిగింది

 

ఈ ప్రయోగాన్ని 2024 30 Dec, 9:58 PM నిమిషాలకు PSLV-C60 రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అవ్వబోతుంది

ఈ ప్రయోగం అనేది కేవలం చంద్రయాన్ 4 లో మాత్రమే కాదు గగన్ యాన్ మిషన్ లో కూడా కీలకంగా మారబోతుంది

భవిష్యత్తులో నిర్మించబోయే స్పేస్ స్టేషన్ కి Docking టెక్నాలజీ చాలా అవసరం అందుకే భారత ప్రభుత్వం 2016 లో
ఈ ప్రయోగానికి 10 కోట్లు కేటాయించింది

ఆ తరువాత 2022 లో ₹124.47 crore ఇండియా sanction చేసింది

Docking టెక్నాలజీ ని అప్పటి సోవియెట్ యూనియన్ (రష్యా ) October 30, 1967 లోనే ప్రయోగించి విజయవంతంగా దాన్ని సాధించింది

ఆ తర్వాత 1975 లో రష్యా నాసా మొట్టమొదటి సారి ఇంటర్నేషనల్ Docking ని కండక్ట్ చేసాయి

అప్పటి నుండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS కి రష్యా తో పాటు చైనా SPACE-X వెహికిల్స్ docking method ని ఉపయోగించి
అందులోకి ప్రవేశిస్తున్నాయి

ఇప్పుడు ఇస్రో కూడా ఆ టెక్నాలజీ ని సాధించే పనిలో పడింది.

4 thoughts on “SPADEX తో సంచలనం సృష్టించబోతున్న ISRO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *