ISRO సాటిలైట్ ని Space x మోసుకెళ్లింది
Space X రాకెట్ Falcon 9 లో మన ISRO satellite ను నవంబర్ 19 న అమెరికా లోని florida నుండి అంతరిక్షంలోకి పంపించింది
మన ISRO ఇప్పటివరకు సొంత satellite లతో పాటు మిగతా దేశాల satellite లను కూడా అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షం లోకి పంపించి విజయవంతమైన స్పేస్ ఏజెన్సీ గా పేరు తెచ్చుకుంది
కానీ ఇప్పుడు మనం తయారుచేసిన satellite ను అమెరికన్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అండ్ Elon musk సొంత కంపెనీ space x నుండి పంపించడానికి కారణం ఏంటి ?
ISRO దగ్గర GSLVM 3 అనే రాకెట్ ఉంది ఈ రాకెట్ దాదాపు 4 టన్నుల బరువు ఉండే కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షం లోకి తీసుకెళ్తుంది అంతకు మించి
బరువు ఉన్న SATELLITE ను తీసుకెళ్లడానికి మన ఇస్రో దగ్గర టెక్నాలజీ లేదు
ఇప్పడు ISRO తయారు చేసిన GSAT-N2 అనే కృత్రిమ ఉపగ్రహం దాదాపు 4700 KG ల కంటే ఎక్కువ బరువు ఉంటుంది అందుకే ఈ Satellite ను
space x తో కలిసి పంపించాలి అని ఇస్రో నిర్ణయం తీసుకుంది
అయితే 4 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉన్న satellite GSAT-N2 ప్రత్యేకత ఏంటి అది ఎందుకు అంత బరువు ఉంది?
GSAT-N2 అనేది ఒక ప్రత్యేకమైన satellite ఎందుకంటే ఇది విమానం లో వెళ్తున్నప్పుడు ప్రయాణికులకు ఇంటర్నెట్ సేవలు అందించడానికి రూపొందించిన satellite
మనకు తెలుసు విమానం లో internet ని ఉపయోగించడం సురక్షితం కాదు అని అలాగే సిగ్నల్స్ కూడా విమానం లో వెళ్తున్నప్పుడు అందుకోవడం కష్టం
కానీ మన ఇండియన్ govt ఇక నుండి విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఒప్పుకుంది దానికి కొన్ని షరతులు కూడా పెట్టింది
అంటే పైలట్ అనుమతితోనే ఇంటర్నెట్ ని ఉపయోగించాలి, కొన్ని సమయాల్లోనే ఇంటర్నెట్ ఉపయోగించుకునే అవకాశం ఉంది
ఇలాంటి ఇంకొన్ని నియమాలతో విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఈ satellite ఉపయోగపడబోతుంది
అంతే కాదు భారత దేశం లో ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో internet సేవలు అందించే ఉద్దేశ్యం తో కూడా దీన్ని రూపొందించారు
ఇందులో 32 user beams ని అమర్చారు అందులో 8 narrow spot beams ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాలు అయిన అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, అస్సాం, మేఘాలయ లాంటి రాష్ట్రాల కోసం కేటాయిస్తే మిగతా 24 wide spot beams మిగతా దేశం కోసం అలాగే లక్షద్వీప్ దీవులలో కూడా ఇంటర్నెట్ సేవల కోసం పనిచేయబోతున్నాయి
ఒక టార్చ్ లైట్ నుండి వెలుగు వొచినట్టు గా సిగ్నల్స్ ను GSAT-N2 satellite ఇండియా లోని ప్రదేశాల మీదకి పంపిస్తుంది దాన్ని అందుకోవడానికి వివిధ ప్రాంతాలలో hub స్టేషన్స్ ఉంటాయి
ఈ satellite 14 సంవత్సరాల పాటు దాని సేవలు అందిస్తుంది
space x GSAT-N2 oribit లోకి పంపించడం మనం వీడియో లో చూడొచ్చు
ఈ 14 సంవత్సరాలలో ఇస్రో 4 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉన్న satellite ను పంపించగలిగే టెక్నాలజీ ని సిద్ధం చేసుకుంటుంది అందుకోసం
మన భారత ప్రభుత్వం ఇప్పటికే 8,240 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించింది,
దానికి NGLV అని పేరు పెట్టారు అంటే next generation launch vehicle అని పేరు పెట్టారు
అయితే GSAT-N2 పంపించడానికి space x 60 నుండి 70 మిలియన్ డాలర్లు ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది
ముక్యంగా GSAT-N2 అనేది new space ఇండియా limited అనే private కంపెనీ తయారుచేసిన satellite
ఇస్రో మొదటి సారి ప్రైవేట్ కంపెనీ తో కలిసి డెవలప్ చేసిన కృత్రిమ ఉపగ్రహం ఇది
ఇది మాత్రమే కాదు ఇస్రో ఇంకా కొన్ని ప్రాజెక్ట్ లలో ప్రైవేట్ కంపెనీ లతో కలిసి పనిచేస్తుంది
దానికి కారణం ఇస్రో దగ్గర తగినంత బడ్జెట్ లేకపోవడమే అని ఇస్రో చైర్మన్ s సోమనాథ్ గారు చెప్పడం జరిగింది
ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇస్రో కు 12000 వేల కోట్ల రూపాయల నిధులు అందిస్తుంది కానీ ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్ట్ లను అంతకన్నా ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి ప్రైవేట్ కంపెనీ లను ఇస్రో చేర్చుకొని పనిచేస్తుంది అప్పుడే ఇస్రో ఎదుగుతుంది అని సోమనాథ్ గారు తెలియజేసారు
అంతే కాదు ప్రైవేట్ కంపెనీ లు స్పేస్ exploration లో పాల్గొనడం వల్ల ఇస్రో కేవలం రాకెట్ లను స్పేస్ లోకి పంపించే పనిలో కాకుండా సైంటిస్ట్ లకు ఉన్న ముఖ్యమైన లక్ష్యం మీద ఫోకస్ పెట్టి పనిచేసే వీలు ఉంటుంది అంటే research మీద ఎక్కువ దృష్టి పెట్టొచ్చు అనేది ఇస్రో ఉద్దేశ్యం,
అంటే రాబోయే చంద్రయాన్ 4 లో చంద్రుడి మట్టిని భూమికి తీసుకురావడానికి టెక్నాలజీ ని develop చేస్తున్నారు దానికోసం ఇస్రో scientist లు పనిచేయాల్సి ఉంటుంది
మరొకవైపు వివిధ రకాల కృత్రిమ ఉపగ్రహాలను వివిధ సేవలకోసం అంతరిక్షం లోకి పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఇస్రో ఇక్కడ తెలివిగా రెగ్యులర్ గా చేసే satellite తయారీ కోసం ప్రైవేట్ కంపెనీ లను తీసుకొచ్చింది
అయితే ఇందులో ప్రైవేట్ కంపెనీ లకు కూడా లాభం ఉంటుంది స్పేస్ exploration మీద 1 రూపాయి పెట్టుబడి పెడితే దానికి 2 రూపాయల 50 పైసల లాభం ఉంటుంది అని కూడా ISRO చైర్మన్ సోమనాథ్ గారు వివరించడం జరిగింది
కాబట్టి స్పేస్ ని అంత తేలికగా తీసుకోవడానికి లేదు అని అర్ధం అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఇండియా స్పేస్ ఎకానమీ 9 బిలియన్ డాలర్లు గా ఉంది అంటే అది మన ఇస్రో బడ్జెట్ (1.5 బిలియన్ ) కంటే చాలా ఎక్కువ, భవిష్యత్తులో ఇది 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది అని అంచనా,
కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ ఎకానమీ లో 2% మాత్రమే ఇస్రో కలిగి ఉంది, దాన్ని పెంచుకోవాలి అంటే ప్రైవేట్ కంపెనీ లను ఇస్రో ఉపయోగించుకోవాలి
అదే పని ఇప్పుడు ISRO చేసి చూపిస్తుంది.