Free journals : 7 లక్షల subscription ప్లాన్ free గా ఇస్తున్న భారత్

free journals

Free Journals :పరిశోధన పత్రాల మీద 6 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న భారత్

2023 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా Research papers ని పబ్లిష్ చేసిన దేశాలలో మన ఇండియా మూడోవస్థానం లో ఉంది
అయినా సరే కొన్ని వేల మంది స్టూడెంట్స్ కానీ పరిశోధన చేసే పరిశోధకులు కానీ వాటిని చదవడానికి వీలు లేకుండా పోయింది
ఎందుకంటే ఆ విలువైన జ్ఞానం ఉన్న పరిశోధన పేపర్స్ అనేవి అంతర్జాతీయంగా ఉన్న కొన్ని సంస్థల దగ్గర ఉంటాయి

వాటిని చదవడానికి నెలకు కానీ సంవత్సరానికి కానీ Subscription మోడల్ లో డబ్బులు చెల్లించి చదవాల్సి ఉంటుంది
మన ఇండియా లో వాటికీ విపరీతమైన ధరలు ఉంటాయి ఎందుకంటే అవన్నీ డాలర్ లలో ఉంటాయి కాబట్టి,

Example కి Acta Astronautica అనే ఒక జర్నల్ ని చదవాలి అంటే ఒక సంవత్సరానికి $ 8,252 కట్టి చదవాల్సి ఉంటుంది,

మన ఇండియన్ కరెన్సీ లో 6,98,855  దాదాపు ఏడు లక్షల వరకు ఖర్చు అవుతుంది,

Free journals

దీన్ని బట్టి పరిశోధన చేసిన  Papers కు ఎంత డిమాండ్ ఉందొ మనం అర్ధం చేసుకోవొచ్చు

అయితే వాటిని కొనుక్కొని చదివే పరిస్థితుల్లో మన భారతీయ స్టూడెంట్స్ లేరు ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ఫీజు లు కూడా అంత ఖరీదు ఉండవు,

ఇక స్టూడెంట్స్ వాటిని కొనుక్కొని చదివేంత స్థోమత కూడా వారికి ఉండదు

అందుకే మన ఇండియన్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా జ్ఞానాన్ని మన భారతీయ విద్యార్థులు పరిశోధకులు యూనివర్సిటీ లు కూడా నేర్చుకొని
విజ్ఞానం లో ముందుండాలి అనే ఉద్దేశ్యం తో

అత్యంత ఖరీదైన 13,000 journals ని ఖరీదు చేసింది వీటిని 18 million students కి అలాగే faculty, and researchers కి ఉచితంగా ఇవ్వబోతుంది

free journals-”One Nation One Subscription”

దీనికోసం One Nation One Subscription అనే scheme ని తీసుకొచ్చింది ఈ స్కీం 1 January 2025 నుండి ప్రారంభం అవుతుంది

ఇందుకోసం భారత ప్రభుత్వం $715 million డాలర్లు (6,000 crore) ఖర్చు చేసింది ఈ ఫ్రీ సర్వీస్ ని 3 సంవత్సరాల పాటు అన్ని రంగాలలో ఉండే స్టూడెంట్స్ కి అలాగే 6,300 ప్రభుత్వ యూనివర్సిటీ లకు ,

Colleges, research bodies, and Institutions మిగతా పరిశోధకులకు ఇవ్వబోతుంది

ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద ఒప్పందం

space debris falls in kenya
కెన్యాలోని ఒక గ్రామం మీద అంతరిక్షం నుండి పడిన వింత వొస్తువు, అదేంటో చెప్పలేకపోతున్న అధికారులు |Space debris falls in kenya

దీనికోసం మన భారతప్రభుత్వం 2 ఏళ్లుగా పబ్లిషర్స్ తో మంతనాలు జరుపుతుంది ముందుగా సంవత్సరానికి 4000 వేల కోట్లు డిమాండ్ చేసారని,

అక్కడ నుండి మన వాళ్ళు చాలా తెలివిగా సంవత్సరానికి 1800 వందల కోట్లు మాత్రమే చెల్లించేలా బేరం కుదుర్చి ఒప్పందం చేసుకున్నారు అని central government తెలిపింది

free journals

సింపుల్ గా అర్ధం అయ్యేలా చెప్పాలి అంటే Netflix subscription ని ఇండియా లో ఉండే అందరికోసం మన govt తీసుకుంటే
ఎలా ఉంటుందో అదే ఇప్పుడు ఇండియా చేసింది కాకపోతే Netflix స్థానం లో Elsevier, Springer Nature, and Wiley లాంటి అంతర్జాతీయంగా

పేరుమోసిన పరిశోధనా సంస్థల subscription తీసుకుంది అది కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం…..,One Nation One Subscription

journals అంటే ఏంటి ?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ లలో స్టూడెంట్స్ కానీ లేదంటే కొన్ని రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లలో పరిశోధకులు వివిధ రంగాలలో చేసిన

పరిశోధనలను Experiment చేసి వాటిని నిరూపించి దానికి సంబంధించిన పరిశోధనా వివరాలను ప్రచురిస్తారు
ఉదాహరణకు COVID సమయం లో దానికి వాక్సిన్ ని ఎన్నో సంస్థలు తయారుచేశాయి కానీ కొన్ని మాత్రమే ప్రయోగంలో ఫలించాయి

అలాంటి పరిశోధనా వివరాలను ఆ సంస్థ జర్నల్స్ రూపం లో పెద్ద పెద్ద సంస్థల దగ్గర పెడుతుంది దాన్ని చదవడానికి
ఆ సంస్థలు Subscription రూపం లో డబ్బు తీసుకుంటాయి

అలా knowledge అనేది Distribute అవుతుంది,

ఇప్పుడు ఆ విజ్ఞానాన్ని మన భారతీయులకు అందించడానికి మన ప్రభుత్వం ఇంతపెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుంది
దీనివల్ల భవిష్యత్తులో సైన్స్ లో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి, మానవాళి అభివృద్ధికి, జీవన విధానం మెరుగుపడడానికి
ఎంతో తోడ్పడుతుంది

అంతే కాదు భారతీయ విద్యార్థులకు విలువైన జ్ఞానం అందుతుంది దాంతో మనవాళ్లకు ప్రపంచస్థాయిలో గుర్తింపు వొస్తుంది.

 

 

2 thoughts on “Free journals : 7 లక్షల subscription ప్లాన్ free గా ఇస్తున్న భారత్

  1. Antha bagundhi kani free vachinapudu kuda koncham update cheyandi sir I’m so excited to learn about nature plants

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *