Discovery: అనుకోకుండా 28 కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవుల అవశేషాలు కనుగొన్న ఒక టూరిస్ట్

Discovery: అనుకోకుండా 28 కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవుల అవశేషాలు కనుగొన్న ఒక టూరిస్ట్

ఈ భూమి మీద ఇప్పటివరకు ఎన్ని నాగరికతలు పుట్టి అంతం అయ్యాయో మనం చెప్పలేం అలాగే మనుషులకంటే ముందు
ఎన్నో రకాల జీవరాశులు ఈ భూమి మీద సంచరించాయి

మనిషి కంటే ముందు కాలం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కేవలం డైనోసార్ యుగం మాత్రమే
కానీ వాటికంటే పూర్వం ఎలాంటి జీవులు ఉండేవి అని చెప్పడానికి మన దగ్గర పెద్దగా ఆధారాలు లేవు

కానీ రీసెంట్ గా ఇటలీ లోని ఆల్ప్స్ పర్వతాలలో ట్రెక్కింగ్ చేస్తున్న అమ్మాయి కి అనుకోకుండా ఒక రాయి కనిపించింది

చూడడానికి అది పూర్తిగా సిమెంట్ తో చేసిన పలక లా కనిపించింది, కానీ అలాంటి ఆకారం లో ఉండే రాళ్లు చాలా అరుదుగా కనిపిస్తాయి అని వెంటనే గుర్తించి అవి జంతువుల కాలి గుర్తులుగా భావించింది,

దాన్ని ఫోటో తీసి  తనకు తెలిసిన ఒక నేచర్ ఫోటోగ్రాఫర్ కి పంపించింది
ఆ ఫోటోగ్రాఫర్ తనకు తెలిసిన paleontologist కి పంపించాడు

అలా 28 కోట్ల సంవత్సరాల క్రితం నాటి శిలాజం అనుకోకుండా బయటపడింది

దాని మీద పరిశోధనలు చేసిన సైంటిస్ట్ లు కూడా అది దాదాపు 28 కోట్ల సంవత్సరాల క్రితం నాటి సరీసృపాల కాలి గుర్తులుగా ధ్రువీకరించారు,

అందులో ఒక్క సరీసృపం కాదు కొన్ని రకాల సరీసృపాల కాలి గుర్తులు ఉన్నాయి అని discovery చేసారు

అయితే వీటికి ఎందుకంత విశిష్టత అంటే ఇవి మనకు తెలిసిన డైనోసార్ యుగం కంటే పురాతనమైన జీవులు
అంటే అప్పటికి ఇంకా డైనోసార్ లు పుట్టలేదు

దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవొచ్చు ఆ శిలాజాల discovery ప్రాముఖ్యత ఏంటి అని

28 కోట్ల సంవత్సరాల క్రితం ఇటలీ లోని ఆల్ప్స్ పర్వతాలలో సరస్సులు ఉండేవి ఆ సరస్సు ఒడ్డున ఇవి జీవించేవి

మరి వాటి కాలి గుర్తులు ఎలా ఇన్ని కోట్ల సంవత్సరాలు గా చెదిరిపోకుండా మన వరకు వొచ్చాయి అనే సందేహం వొస్తుంది

నిజానికి ఆ సరస్సు ఉన్న ప్రదేశం లో (sand stone) ఇసుక శిల అలాగే బురద మట్టి ఉండేవి వాటిలో పడిన సరీసృపాల కాలి ముద్రలు
కాలం తో పాటు గట్టిపడి రాయిలా మారిపోయాయి

Orange cave crocodiles
గబ్బిలాలను తింటూ మొసళ్ళు ఆరెంజ్ రంగులో కొత్త జాతిగా పరిణామం చెందుతున్నాయా ? | Orange cave crocodiles

ఈ రాతి శిలాజం లో ఆ కాలం నాటి సరీసృపాల కాలి గుర్తులు మాత్రమే కాదు అందులో 28 కోట్ల సంవత్సరాల క్రితం నాటి వాన చినుకుల ముద్రలు

అలాగే కొన్ని కీటకాలు వాటితో పాటు ఆ కాలం నాటి ఆకులు కొన్ని మొక్కల వేర్లు, కొన్ని విత్తనాలు కూడా లభించాయి

ఒక విధంగా చెప్పాలంటే 28 కోట్ల సంవత్సరాల క్రితం నాటి పర్యావరణ వ్యవస్థ లభించింది అని చెప్పుకోవొచ్చు

DISCOVERY

అయితే ఈ శిలాజం సముద్ర మట్టానికి దాదాపు 1700 మీటర్ల ఎత్తులో లభించింది

కానీ ఈ ప్రదేశం 280 మిలియన్ సంవత్సరాల క్రితం ఇప్పుడున్న భూమిలా ఉండేది కాదు

discovery permia

పైన ఉన్న ఫొటోలో ఉన్నట్టుగా భూమి ఉపరితలం ఉండేది

దీన్ని Permian కాలం అంటారు

అయితే ఆ కాలం లోని జీవులన్నీ అంతరించిపోవడానికి కారణం ప్రకృతిలో జరిగిన విపత్తులు,
ఆ ప్రకృతి విపత్తులు ఏంటి అనేది ఇప్పటివరకు ఎవ్వరూ కనుక్కోలేకపోయారు

ఈ Permian కాలం తరువాతనే Triassic పీరియడ్ మొదలవుతుంది.

 

2 thoughts on “Discovery: అనుకోకుండా 28 కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవుల అవశేషాలు కనుగొన్న ఒక టూరిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *