Deep ocean discovery : సముద్రం లోతుల్లో కొత్త predator జాతి జీవాన్ని కనుక్కున్న సైంటిస్ట్ లు
సౌత్ అమెరికా దగ్గర ఉన్న పసిఫిక్ మహాసముద్రం దగ్గర Atacama Trench అనే అత్యంత లోతైన సముద్ర ప్రాంతం ఉంది
Woods Hole Oceanographic Institution (WHOI) మరియు Chine’s Instituto Milenio de Oceanografía (IMO) కి చెందిన వాళ్ళు
పసిఫిక్ మహాసముద్రం లో 5 సంవత్సరాల నుండి సముద్రం లోతుల్లో పరిశోధన చేస్తున్నారు
tectonic plates కదలికలను సముద్రాల స్వభావాన్ని అర్ధం చేసుకోవడానికి చేస్తున్న పరిశోధనలో సముద్రం లోతుల్లోకి వెళ్లి అక్కడ వాతావరణాన్ని గమనించాల్సి ఉంటుంది
అందులో భాగంగా ఇప్పటివరకు సైంటిస్ట్ లు చూడని ఒక కొత్త జీవాన్ని కనుక్కున్నారు
ఇది చూడడానికి తెలుపు రంగులో విచిత్రంగా ఉండడమే కాదు ఇది ఒక predator అంటే మిగతా జంతువులను వేటాడి చంపి తినే జివి
అయితే దాదాపు 4 సెంటీమీటర్లు ఉండే ఈ జివి సముద్రం లో దాదాపు 25,900 అడుగుల లోతులో జీవిస్తుంది అక్కడే దీన్ని కనుక్కున్నారు
దీనికి Dulcibella camanchaca అని పేరు పెట్టారు,
అయితే శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సముద్రం లోపల ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది సూర్యకాంతి కూడా అక్కడికి చేరుకోలేదు
అలాంటి పరిస్థితుల్లో కూడా జీవం ఎలా మనుగడ సాగిస్తుంది అసలు ఎలా పుట్టింది అనేది అతి పెద్ద ప్రశ్నగా మారింది
దీన్ని బట్టి అంతరిక్షం లో గ్రహాంతర జీవులు పుట్టడానికి మన భూమి లాంటి పరిస్థితులే ఉండాల్సిన అవసరం లేదు అని
పరిస్థితులను బట్టి జీవం పుడుతుంది అని అర్ధం చేసుకోవొచ్చు
ఈ కొత్త జీవం ఆవిష్కరణ అనేది అంతరిక్షం లో ఎలియెన్స్ ని వెతికేవాళ్ళకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అని కచ్చితంగా చెప్పుకోవొచ్చు
ఎందుకంటే మన సౌరకుటుంబంలోనే సముద్రాలతో కూడిన ఉపగ్రహాలు ఉన్నాయి అవి habitable zone లో లేవు అయినా సరే అక్కడ సముద్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా సముద్రగర్భంలో జీవం ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి
మన సౌర మండలం లో సముద్రాలు ఉన్న ఉపగ్రహాల గురించి ఇక్కడ తెలుసుకోండి : Click