Best wildlife photography awards 2024
21 వ శతాబ్దపు ఈ కంప్యూటర్ యుగంలో చుట్టూ మనుషులు నిర్మాణాల మధ్య జీవిస్తున్న మనం నెమ్మదిగా మన భూమి గురించి మర్చిపోతూ వొస్తున్నాం
మన భూమి ఎంత అందమైన గ్రహమో అని మొబైల్ లో చూస్తూ బ్రతికే పరిస్థితికి వొచ్చాము, అంతేకాదు artificial ఇంటలిజెన్స్ తో ప్రకృతిని మరింత అందంగా ఉహించుకొని చూసి మురిసిపోతున్నాం, కానీ భూమి మీద అసలు సిసలైన అందాలు ఎలా ఉంటాయో చూపించడానికి ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో లు అతన్ని 2024 వ సంవత్సరానికి గాను బెస్ట్ ఫోటోగ్రాఫర్ గా నిలబెట్టింది.
2nd place Wildlife Photographer of the Year
ఈ సముద్రపు ఉడుము నీటిలో సగం తేలుతూ ఎగసిపడుతూ ఉండడం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది వీటిని iguana అని పిలుస్తారు, వీటిని సముద్రపు డైనోసార్ లు గా పిలవొచ్చు ఎందుకంటే ఇవి మన భూగ్రహం మీద ఎన్నో దశలను దాటుకుంటూ పరిణామం చెందుతూ వొచ్చింది, అయితే iguana అనేది తోటి iguana లా కాకుండా నీటి అడుగులో జీవించడానికి 60 నిమిషాల వరకు శ్వాసను పట్టి ఉంచడం అలవాటు చేసుకుంది దాంతో ఆహారాన్ని వేటాడి మనుగడ సాగిస్తుంది.
———————————————————————————————————————————————————————
ఈ ఫోటో చూసిన తరువాత ప్రకృతి లో క్రూరత్వం కూడా అందంగా కనిపిస్తుంది కదా అని అనిపిస్తుంది, జాగ్వార్ మొసలి తలను పట్టి చీల్చుతున్నపుడు తీసిన ఫోటో ఇది, దీన్ని 2024 లో తీసిన ఫోటోలలో Deadly bite గా అభివర్ణించారు, దీన్ని ian ford అనే ఫోటోగ్రాఫర్ సౌత్ అమెరికా తీసాడు
ఇతనికి Wildlife Photographer of the Year 2024 అవార్డు ఇచ్చారు.
———————————————————————————————————————————————————————————————————————————————–
ఈఫోటో లో చూస్తున్నది పురాతన కాలం నాటి జంతువుల అవశేషాలు అని అనిపిస్తుంది కానీ కాదు, ఇక్కడ కనిపిస్తున్నది ఒక ఆఫ్రికన్ ఏనుగు దంతం దీన్ని అక్రమ రవాణా చేస్తుండగా uk airport లో పట్టుకున్నారు, ఆ దంతం మీద పడిన స్మగ్లర్ల వేలి ముద్రలను ఫోరెన్సిక్ వాళ్ళు ఇలా కనిపెడుతుండగా తీసిన ఫోటో ఇది.
—————————————————————————————————————————————————————————————————–
మనకు తెలుసు ఎలుగుబంట్లు నదీప్రవాహం లో వెళ్లే సాల్మన్ చేపలను పట్టుకొని వాటిని ఒక విందు లా ఆరగిస్తాయి అని,, కాకపోతే కొన్నేళ్ల నుండి సాల్మన్ చేపలు అంతరించిపోవడం జరుగుతూ వొస్తుంది, అలాంటి సమయం లో Sockeye salmon అనే చేపలు ఇలా ఎలుగు బంటి చుట్టూ చేరి వలస వెళ్తున్నాయి దీన్ని అలస్కా లోని ఒక నేషనల్ పార్క్ లో గమనించి ఫోటో తీసారు, ఇక ఆ ఎలుగు బంటికి మరొక విందు దొరికినట్లే అనిపిస్తుంది.
———————————————————————————————————————————————————————————————————-
ఇక్కడ కనిపిస్తున్న ఫోటో లో మరొక వేట జరుగుతుంది కాకపోతే ఈ సారి ఆకాశ పక్షులు సముద్ర జీవులను వేటాడుతున్నాయి northern Gannets అని పిలవబడే ఈ పక్షుల రెక్కలు 5.9 feet ల వెడల్పు ఉంటాయి అంటే ఒక సాధారణ మనిషి ఎత్తుకు సరిపోయేలా ఇవి ఉంటాయి అలాంటి ఈ పక్షులు అట్లాంటిక్ సముద్రంలోనే అతిపెద్ద పక్షులుగా పిలుస్తారు, ఇది 30 మీటర్ల ఎత్తు నుండి సముద్రం లోకి దూకి చేపలను వేటాడినప్పుడు తీసిన ఫోటో ఇది,World Nature Photography Awards 2024 లో ఇది కూడా ఒకటి.
——————————————————————————————————————————————————————————————————-
ఈ ఫోటో ని చూసినప్పుడు నక్క సముద్రం లోపల నీటి అడుగున సముద్ర గర్భం లో అందాలను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇది ఒక కొండ మీద తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తుండగా కొండ అంచున నిలబడి దాన్ని ఆస్వాదిస్తోంది లేదంటే వేట కోసం సిద్ధం అవుతుందేమో కానీ
ఫోటోగ్రాఫర్ దీన్ని బంధించి 2024 Terrestrial Wildlife category లో నిలబడ్డాడు.
———————————————————————————————————————————————————————————————————–
ఇక్కడ కనిపిస్తున్న ఫోటో లో plainfin midshipman అనే బుల్లి చేపలు పుట్టినతరువాత ఇంకా దాని పచ్చసొన సంచులు అతుక్కొని ఉన్నాయి ఇవి చూడడానికి ఎంతో అందంగా ఎవరో పెయింటింగ్ వేసినట్టుగా రంగులన్నీ అద్దినట్టుగా కనిపిస్తుంది
అందుకే దీనికి Ocean Portfolio category లో మొదటి అవార్డు వొచ్చింది.
—————————————————————————————————————————————————————————————————————
1st place Wildlife Photographer of the Year
సముద్రం లో నివసించే mahi-mahi అనే ఈ చేప ఆహారం కోసం వేటాడుతూ ఉన్నప్పుడు దాని నోటికి చిక్కిన వేటను పట్టుకున్నప్పుడు తీసిన ఈ ఫోటో 2024 లో best wildlife ఫోటోగ్రఫీ అవార్డు దక్కించుకుంది, అయితే ఈ ఫోటో ను అమెరికా లోని కాలిఫోర్నియా లో తీయడం జరిగింది
ఈ ఫోటో ను తీయడానికి Manuel Castellanos Raboso అనే ఫోటోగ్రాఫర్ 16 గంటలు కష్టపడ్డాడు, అందుకేనేమో ఇంత అద్భుతంగా వొచ్చింది.
————————————————————————————————————————————————————————————————————————————————————————————————————————-
3rd place Wildlife Photographer of the Year:
నిస్సార ప్రాంతంలో ఒక పెద్ద పసిఫిక్ ఆక్టోపస్. “శరదృతువు చివరిలో, నీటి ఉష్ణోగ్రత తీవ్రంగా 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినప్పుడు, పెద్ద పసిఫిక్ ఆక్టోపస్‌లు లోతులేని నీటికి పరుగెత్తుతాయి”
How to access one nation one subscription