Neanderthals తో ఆధునిక మానవ పూర్వికులు సంపర్కం జరిపారని కనుగొన్న శాస్త్రవేత్తలు
human history లో వివిధ మానవ జాతులకు చాలా ప్రాముఖ్యత ఉంది
ఇప్పుడు మనం ఇంత ఆరోగ్యంగా ఉంటూ నచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ బ్రతుకుతున్నాం అంటే దానికి కారణం మనకన్నా ముందు అంతరించిపోయిన మానవజాతులు మన పూర్వికులు అని చెప్పుకోవాలి
ఎందుకంటే మొట్టమొదటి సారి మాంసం కాకుండా చెట్ల మీద ఉండే పండ్లను ఆకులను తిని అందులో విషం ఉన్న ఫలాలు తిని కొంతమంది చనిపోతే
వాళ్ళను చూసి ఆ ఆహారం జోలికి వెళ్లకుండా మిగతా ఫలాల మీద ప్రయోగాలు చేస్తూ సరైన ఆహారాన్ని ముందు జాతుల కోసం సిద్ధం చేసిన వాళ్ళు మన పూర్వికులు
కొన్ని లక్షల సంవత్సరాల పాటు నాగరికత పుట్టకపోవడానికి కారణం మనుగడ మాత్రమే ప్రధాన లక్ష్యంగా ఉంటూ ప్రకృతి నుండి మిగతా జాతి జంతువుల నుండి కాపాడుకుంటూ ఎన్నో ప్రయోగాలతో, లక్షల ఏళ్ళు గడిపారు
అలా అంతరించిపోయిన ఒక జాతిగా Neanderthals ని చెప్పుకుంటారు
ఈ Neanderthals యూరోప్ లో జీవించేవారు
వీళ్ళు ఎక్కువగా రాతి గుహలలో జీవించేవారు కానీ వీళ్లకు నిప్పును పుట్టించడం తెలుసు, వాళ్ళ గుహలలో పొయ్యిని ఏర్పాటు చేసుకొని బ్రతికినట్టు ఆనవాళ్లు ఉన్నాయి,
అంతేకాదు విల్లు దుప్పట్లు బట్టలు తయారుచేసుకున్నారు, సముద్ర ప్రయాణం చేసారు ,
తీవ్రమైన గాయాలకు ఔషదాలు కూడా ఉపయోగించారు
వీళ్ళకి మాట్లాడే సామర్థ్యం ఉండేది కానీ వాళ్ళ బాషా ఎలా ఉండేదో మనకు తెలియదు
అయితే వీళ్ళు అంతరించిపోవడానికి ఒక కారణం వీరు బయట మనుషులతో కలిసేవారు కాదు,
వాళ్ళల్లో వారే సంపర్కం చేసుకోవడం వల్ల జన్యుపరమైన లోపాలతో నశించిపోయారు అని ఒక వాదన ఉంది
వీళ్ళ జనాభా కూడా 5 వేల నుండి 12 వేల వరకు మాత్రమే ఉండేది, వీరు పొట్టి కాళ్ళు పొట్టి చేతులతో ఛాతి భాగం వెడల్పు తో ఉండేవారు
వీళ్ళు ఎంత పురాతనమైన జాతి అంటే (4,30,000) 4 లక్షల 30 వేల సంవత్సరాల క్రితం నివసించిన మనిషి ఎముకలు లభించాయి
ఒక్కసారి ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మనం 2 వేల సంవత్సరాల నుండి మాత్రమే కాలాన్ని రికార్డు చేస్తూ వొస్తున్నాం
అంతకు మించి 5 వేల ఏళ్ళ నాటి సింధూ నాగరికత, మెసపొటేమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, గురించి తెలుసుకొని
అదే మనకు పునాది అనుకుంటూ వొస్తున్నాం.
కాని మనుషులు 4 లక్షల 30 వేల సంవత్సరాల క్రితం కూడా జీవించారు
కానీ మొదటి నాగరికత ఆనవాళ్లు కనుక్కున్నది 5 వేల ఏళ్ళ క్రితం నాటిది మాత్రమే
కాబట్టి మిగతా 4 లక్షల 25 వేల సంవత్సరాల ఈ మధ్య కాలంలో నాగరికత ఎందుకు ఏర్పడలేదు వాళ్లు ఎందుకు అభివృద్ధి చెందలేదు
ఈ మధ్య కాలంలో ఎం జరిగిందో ఒక మిస్టరీగానే ఉంటుంది
అయితే 4,30,000 సంవత్సరాల క్రితం నివసించిన Neanderthals అనే మానవజాతి 40 వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయారు
వీళ్ళు ఎలా అంతరించిపోయారు అని చెప్పడానికి శాస్త్రవేత్తల దగ్గర పెద్దగా ఆధారాలు లేవు
అయితే 43 వేల సంవత్సరాల నుండి 50 వేల సంవత్సరాల క్రితం ఇప్పుడున్న Homo sapiens జాతి మానవులు
Neanderthals తో సంపర్కం జరిపి పిల్లల్ని కన్నారని ఇటీవలే కనుక్కున్నారు
Neanderthals యొక్క ఏడు జీనోమ్ లు 45,000 సంవత్సరాల క్రితం నివసించిన Homo sapiens జాతి మనుషులలో ఉన్నట్టు గుర్తించారు
అది కూడా కేవలం యూరోప్ లో నివసించిన ఆధునిక మానవుల పూర్వీకుల్లో మాత్రమే కనుక్కున్నారు
జర్మనీ లో దొరికిన 6 అస్థిపంజరాలలోని genome లు మధ్య ఐరోపా లోని Czech Republic అనే ప్రాంతంలో దొరికిన మానవ ఎముకలలో ఉన్న ఒక genome ని పరీక్షించినపుడు
వీళ్ళు ఇద్దరూ దగ్గర సంబంధీకులు అని ఒకేకాలం లో జీవించారు అని కనుక్కున్నారు