ISRO Gaganyaan కోసం ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ

isro

ISRO Gaganyaan కోసం ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ పనిచేయబోతుంది

ISRO Gaganyaan మిషన్ తో మొట్టమొదటి సారి అంతరిక్షంలోకి మన భారతీయ వ్యోమగాములను తీసుకెళ్లబోతుంది అని అందరికి తెలుసు

అయితే ఈ మిషన్ కి సంబంధించి ఇస్రో ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ తో కలిసి పనిచేయబోతుంది

ఇస్రో ఈ మిషన్ ని సొంతంగా చేస్తుంది అయినా సరే మన వ్యోమగాములకు రష్యా ట్రైనింగ్ ఇచ్చింది

ఇప్పుడు ఆస్ట్రేలియా సహాయం కూడా తీసుకోబోతుంది

అదెలా అంటే!

గగన్ యాన్ మిషన్ తో మన వ్యోమగాములు మూడు రోజుల పాటు అంతరిక్షం లో Low Earth Orbit లో భూమి చుట్టూ ఆర్బిట్ చేస్తారు

కానీ వాళ్ళు తిరిగి భూమికి ఎలా వొస్తారు, వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతారు అనేది ప్రశ్న

ఇది విమాన ప్రయాణం కాదు కదా ఇండియా లో ఎక్కడైనా ఒక రన్ వే మీద ల్యాండ్ అవ్వడానికి

దానికి సరైన ప్రదేశం ఉండాలి ముక్యంగా వ్యోమగాములు కిందికి రాగానే వాళ్ళని చాలా ఫాస్ట్ గా రికవర్ చేయాలి

అయితే మన వ్యోమగాములు ఆస్ట్రేలియా కి దక్షిణ భాగం లో ఉన్న మహాసముద్రం లో ల్యాండ్ అవ్వబోతున్నారు అని ఇస్రో తెలిపింది

isro

SpaDeX
ఇస్రో విజయవంతంగా SpaDeX Docking ప్రక్రియను పూర్తి చేసింది

దానికి సంబంధించి ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ మన వ్యోమగాములను కనిపెట్టి వాళ్ళని తొందరగా రికవర్ చేసే బాధ్యత తీసుకుంటుంది

నవంబర్ 2024 లో ఇస్రో కి ఆస్ట్రేలియా కి మధ్య ఒప్పందం జరిగింది ”Implementation Agreement (IA)”

ఈ విషయాన్నీ ISRO స్వయంగా తెలిపింది

 

ISRO

అయితే ఆస్ట్రేలియా కేవలం మన Gaganyaan మిషన్ లో crew module ని recover చేయడం లో మాత్రమే కాకుండా ఇంకా కొన్ని కీలకమైన విషయాలలో కలిసి పనిచేసే అవకాశం ఉంది

ముక్యంగా ఆస్ట్రేలియా లో ప్రపంచం లోనే అతిపెద్ద రేడియో టెలీస్కోప్స్ ఉన్నాయి
నాసా వీటితోనే spacecraft లతో కమ్యూనికేట్ చేస్తుంది, చంద్రయాన్ 2 సిగ్నల్ loss అయినప్పుడు
నాసా వీటి సహాయంతో సిగ్నల్ తిరిగి build చేయడానికి ట్రై చేసింది కానీ పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు

కానీ భవిష్యత్తులో NASA అవసరం లేకుండా మన ఇస్రో డైరెక్ట్ గా ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ తో పనిచేయడానికి ఇప్పుడు చేసుకున్న ఒప్పందం చాలా ఉపయోగపడుతుంది

isro

2 thoughts on “ISRO Gaganyaan కోసం ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *