Asteroid లో సౌరమండల పుట్టుక రహస్యం
మన సౌర మండలం గురించి ఎన్ని పరిశోధనలు చేసి తెలుసుకున్నా సరే ఇంకా తెలియాల్సింది చాలా ఉంది
అందులో ముక్యంగా మన సౌరమండలం పుట్టుక గురించి మనకు చాలా తక్కువ మాత్రమే తెలుసు
విశ్వం లో ఎన్నో నక్షత్రాలను వాటి చుట్టూ గ్రహాలను కనుకున్నాం కానీ వాటి పుట్టుకలో లేని రహస్యం మన సోలార్ సిస్టం లో ఏం జరిగిందని భూమి లాంటి గ్రహాన్ని మన సూర్యుడు తయారుచేసుకోగలిగాడు,
ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని దశాబ్దాల నుండి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు
అయితే సౌరమండలం పుట్టుకలో ముఖ్యపాత్ర పోషించినవి ఏవైనా ఉన్నాయి అంటే అవి asteroids మాత్రమే ఎందుకంటే
మనకు తెలుసు నక్షత్రాలు తయారవ్వాలి అంటే దానికి కావాల్సింది (cosmic dust clouds) అంతరిక్షపు ధూళి మేఘాలు
ఈ ధూళి మేఘాలు గ్రావిటీ కారణంగా ఒకేదగ్గరికి చేరి నక్షత్రాల పుట్టుకకు కారణం అవుతాయి
అయితే ఆ ప్రాసెస్ లో ముందుగా పుట్టేది గ్రహశకలాలు (Asteroids)
అందుకే ఆ గ్రహశకలాలు మనం పరిశోధిస్తే సౌరమండల పుట్టుక రహస్యం తెలుస్తుంది అని
జపాన్ కి చెందిన సైంటిస్టులు అంతరిక్షం లో మనకు దగ్గరగా ఉన్న Ryugu అనే ఆస్టెరాయిడ్ నుండి కొంత మట్టిని తీసుకొచ్చి దాన్ని పరీక్షిస్తే ఆ రహస్యం తెలుస్తుంది అని దానికోసం ఒక మిషన్ ని పంపించాలి అనుకున్నారు
అనుకున్నట్టుగానే 2014 లో హయబుస2 అనే అంతరిక్ష నౌకను ఆ ఆస్టెరాయిడ్ దగ్గరికి పంపించారు
2019 లో అనుకున్నట్టుగా asteroid నుండి దాని మట్టిని తీసుకొని 2020 లో మన భూమి మీద ల్యాండ్ అయ్యింది
చరిత్ర లో ఒక asteroid మట్టిని తీసుకొచ్చిన మొట్టమొదటి సంఘటన ఇదే ఆ తరువాత నాసా కూడా ఆ ఘనత సాధించింది
అయితే ఆ ఆస్టెరాయిడ్ మట్టిని జపాన్ కొన్ని దేశాలలో ఉన్న సైంటిస్టులకు పంపించి వాటి మీద పరిశోధనలు చేయాలని కోరింది
అండ్ ఆ samples మన ఇస్రో దగ్గరికి కూడా వొచ్చాయి
2020 నుండి కొనసాగుతున్న పరిశోధనలో ఒక interesting విషయం బయటపడింది
అదేంటంటే 4 బిలియన్ సంవత్సరాల క్రితం సౌరమండలం లో ఉన్న ప్రతీ asteroid డస్ట్ క్లౌడ్స్ అన్ని కూడా
మాగ్నెటిక్ ఫీల్డ్ ని కలిగి ఉన్నట్టు కనుక్కున్నారు
మనకు తెలుసు భూమి మీద జీవం పుట్టడానికి మాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత కీలకమైనదో అంతే కాదు ఎంతో ప్రమాదకరమైన రేడియేషన్ నుండి మన భూమిని కాపాడుతుంది
ఒకవేళ భూమి కి మాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే భూమి మార్స్ లా తయారవుతుంది
అంటే భవిష్యత్తులో ఎలియెన్స్ భూమిని visit చేస్తే కనీసం సూక్ష్మ జీవులు కూడా భూమ్మీద ఉన్నట్టు వాళ్ళు కనుక్కోలేరు
అంతలా మన భూమి మారిపోతుంది
అలాంటి magnetic ఫీల్డ్ సౌరమండల పుట్టుకకు కారణం అయినట్టుగా తెలుస్తుంది
ఇప్పుడు జపాన్ తీసుకొచ్చిన ర్యుగు asteroid లో మాగ్నెటిక్ field అనేది చాలా తక్కువగా ఉంది దానికి కారణం
ఈ ఆస్టెరాయిడ్ 4బిలియన్ సంవత్సరాల క్రితం సౌరకుటుంబం చివర్లో ఉన్నట్టు గా భావిస్తున్నారు
ఆ తరువాత అది సూర్యుడికి దగ్గర వొచ్చి అందులో ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ లో చాలా కోల్పోయినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు
అయితే ఆస్టెరాయిడ్ లో మాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్లనే cosmic dust మొత్తం బైటికి వెళ్లిపోకుండా మన సౌరవ్యవస్థ లోనే తిరుగుతూ అవి గ్రహాలుగా రూపాంతరం చెంది ఉంటాయి అని భావిస్తున్నారు
ర్యుగు ఆస్టెరాయిడ్ లో మాగ్నెటిక్ field ఎంతలా ఉంది అంటే దాని అణువులలో కూడా అయస్కాంత తత్వం ఉన్నట్టు గుర్తించారు
ఆస్టెరాయిడ్ మట్టిని magnetometer అనే instrument దగ్గర ఉంచినపుడు ఆ మాగ్నెటోమీటర్ అయస్కాంత తీవ్రతను దాని direction ను గుర్తించింది
వాటిలో ఉన్న మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 4బిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఎలా గుర్తించగలిగారు
దానికోసం రీసెంట్ గా ఏర్పడ్డ magnetic ఫీల్డ్ ని ఉత్పత్తిచేసే అణువులను ఆస్టెరాయిడ్ శాంపిల్ నుండి తొలగిస్తూ వెళ్లారు
సరిగ్గా ఒక టేప్ రికార్డర్ లో టేప్ ను వెనక్కి తిప్పితే పాట మొదటి పల్లవికి ఎలా వెళ్తామో
సరిగ్గా అలాగే శాస్త్రవేత్తలు asteroid లో పురాతన అణువులను గుర్తించి అవి 4 బిలియన్ సంవత్సరాల క్రితం నాటివి అని డిటెక్ట్ చేసారు
అంటే 4 బిలియన్ సంవత్సరాల క్రితం సౌరమండలం మొత్తం నిండి ఉన్న ఆస్టెరాయిడ్స్ అలాగే cosmic dust పార్టికల్స్ magnetic ఫీల్డ్ తో ఈ సౌరమండలాన్ని సృష్టించినట్టు తెలుస్తుంది
దీని గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి
జపాన్ తరువాత నాసా కూడా OSIRIS REX అనే మిషన్ తో బెన్నూ అని పిలవబడే ఆస్టెరాయిడ్ నుండి మట్టిని తీసుకొని భూమికి వొచ్చింది
దీని మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి
ఒక పరిశోధన బైటికి రావాలి అంటే ఎంతో సమయం కృషి దాని వెనుక ఉంటుంది
నాసా ఈ బెన్నూ ఆస్టెరాయిడ్ శాంపిల్ ని జపాన్ JAXA (Japan Aerospace Exploration Agency) తో పంచుకుంది
NASA ,JAXA ఇద్దరి లక్ష్యం మన గ్రహాల పుట్టుక గురించి తెలుసుకోవడమే
అందుకే ఇద్దరూ ఎన్నో ఏళ్ళు కష్టపడి ఏ దేశం సాధించని ఆస్టెరాయిడ్ సాంపిల్స్ ని ఒకరితో ఒకరు పంచుకొని వాటి మీద
పరిశోధనలు మొదలు పెట్టారు
అయితే నాసా బెన్నూ నుండి 121.6 grams మట్టిని సేకరిస్తే జపాన్ మాత్రం ర్యుగు ఆస్టెరాయిడ్ నుండి 5.4 grams మట్టిని మాత్రమే సేకరించింది
అందుకే జపాన్ నాసా కి అందులో 23 millimeter-sized రేణువులను మాత్రమే ఇచ్చింది కానీ నాసా దగ్గర ఎక్కువ మట్టి ఉంది కాబట్టి
0.66 grams శాంపిల్ ని జపాన్ కి ఇచ్చింది
ఇప్పటివరకు నాసా తెచ్చిన బెన్నూ మట్టిలో carbon and nitrogen ఎక్కువ మొత్తం లో ఉన్నట్టు కనుక్కున్నారు
అంతే కాదు అందులో phosphorous and water అణువులు ఖనిజాలు ఉన్నట్టు మొదటి పరిశోధనలో తెలిసింది
అంటే మన భూమి మీద నీరు రావడానికి కారణం asteroids ఏ అనుకోవొచ్చు
దీని మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.