TRAPPIST Alien planet లో వాతావరణం
ఖగోళ శాస్త్రవేత్తలు మన భూమి లాంటి గ్రహాన్ని కనుక్కోవడానికి చేయని ప్రయత్నాలు అంటూ లేవు, కొన్ని దశాబ్దాలుగా భూమి లాంటి గ్రహాలను మనం వెతుకుతూనే ఉన్నాం, కాలం మారుతున్నా కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది దానివల్ల ఏలియన్ గ్రహాలను కనుక్కోవడం లో మనం ఎంతో ముందుకు వొచ్చేసాం,
అంటే ఒకప్పుడు యూనివర్స్ లో ఒక గ్రహాన్ని కనుక్కోవడం అద్భుతం అనుకుంటే ఇప్పుడు అలాంటి గ్రహాలను వేల సంఖ్యలో కనుక్కోవడం మొదలుపెట్టాం కానీ అందులో మన భూమి లాంటి గ్రహాలు ఎన్ని ఉన్నాయి అనేది శాస్త్రవేత్తలు ప్రశ్నించుకుంటున్నారు
ఎందుకంటే మన భూమి లాంటి గ్రహాలను కనుక్కున్నప్పుడే అందులో ఏలియన్స్ ని మనం కనుక్కోగలుగుతాం, మనిషి చేసే అన్వేషణకు ఒక సమాధానం లభిస్తుంది. దానికోసం hubble space టెలీస్కోప్ దగ్గర నుండి ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలీస్కోప్ ని అంతరిక్షంలోకి పంపించి ఏలియన్ గ్రహాలను వెతుకుతున్నాం,
అయితే ఈ అన్వేషణ లో భాగంగా 2017 లో మన భూమి లాంటి గ్రహన్నీ కనుక్కోవడమే కాదు ఏకంగా మన సౌరకుటుంబం లాంటి ఇంకొక planetary స్టార్ సిస్టం ని కనుక్కున్నాం, దానిపేరు TRAPPIST సిస్టం, ఇది మన భూమి నుండి 40 కాంతి సంవత్సరాల దూరం లో ఉంది, కానీ అందులో ఎలాంటి వాతావరం ఉంది అక్కడ ఎలా ఉంటుంది అనే విషయాలు సుస్పష్టంగా శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు దానికోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి, జేమ్స్ వెబ్ టెలీస్కోప్ అంతరిక్షం లోకి వెళ్ళాక ఆ పరిశోధనలు ఇంకా వేగవంతం అయ్యాయి
ఇటీవలే ఈ TRAPPIST సోలార్ సిస్టం లో TRAPPIST -1బి అనే గ్రహం లో carbon dioxide తో కూడిన వాతావరణం ఉంది అని జేమ్స్ వెబ్ టెలీస్కోప్ తో చేసిన పరిశోదలో తెలిసింది అంతే కాదు ఆ గ్రహం లో అగ్నిపర్వతాలతో కూడిన వాతావరణం కూడా ఉండడం వల్ల అక్కడ టెంపరేచర్ కూడా అధికంగానే ఉంది కనుక్కున్నారు
ఇంతకుముందు చేసిన పరిశోధనలలో trappist 1బి అనేది రాతి నేల తో నిర్జీవంగా ఉండే గ్రహం గా గుర్తించారు అంటే అందులో ఉండే ఉష్ణోగ్రత అనేది గ్రహం నుండి అంతరిక్షంలోకి వెళ్తుంది అని అనుకున్నారు అంటే రేడియేషన్ తో అక్కడ వాతావరణం అనేది పూర్తిగా నశించిపోయింది అని అనుకున్నారు కానీ రీసెంట్ గా జేమ్స్ వెబ్ టెలీస్కోప్ తో చేసిన observation లో carbon dioxide వాతావరణం ఉన్నట్టు గుర్తించారు అంటే ఉషోగ్రత ఆ గ్రహం నుండి అనుకున్న దానికంటే తక్కువగానే వెళ్తుంది అని తెలిసింది
అయితే ఆ ఉష్ణోగ్రత అనేది పగలు నుండి రాత్రికి ఎలా మార్పు చెందుతుంది, గ్రహం మొత్తం వ్యాపిస్తుందా లేదా అనేది కనుక్కోవాల్సి ఉంది దాంతో పాటు అక్కడ ఉండే ఉష్ణోగ్రత ద్రవస్థితికి అనుకూలంగా ఉంటుందా లేదా అనే విషయాల మీద ఇంకా పరిశోధన జరుగుతున్నాయి
అయితే carbon dioxide వాతావరణం వల్ల అక్కడ ఎలియన్ ప్రాణులు పుట్టే అవకాశం ఉందా అంటే దానికి కూడా అవకాశం లేకపోలేదు ఎందుకంటే భూమిమీద carbon dioxide వల్ల బ్రతికే జీవులలో తాబేలు ఒకటైతే Neisseria meningitidis, అనే గ్రామ్ నెగటివ్ బాక్టీరియా కూడా carbon dioxide ని పీల్చుకొని బ్రతుకుతుంది
కాబట్టి carbon dioxide మెండుగా ఉన్న trappist 1బి వాతావరణం లో దానికి తగ్గట్టుగా జీవులు పరిణామం చెందే అవకాశం ఉంది
కాకపోతే ఆ ఏలియన్ ప్రాణులు బాక్టీరియా పరిమాణం లో ఉంటాయా లేకపోతే తాబేలు పరిమాణం లో ఉంటాయా లేకపోతే ఇంకా ఎక్కువ సైజు లో ఉంటాయా అనేది ముందు ముందు పరిశోధనల్లో బయటపడాల్సి ఉంది
అయితే జీవులు మాత్రమే కాదు చెట్లు కూడా కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుంటాయి అని మనకు తెలుసు, కాబట్టి ఇప్పుడు కనుక్కున్న కార్బన్ డయాక్సైడ్ మెండుగా ఉన్న గ్రహం భవిష్యత్తులో ఇంకెన్ని కొత్త విషయాలను మనకు చూపిస్తుందో వేచి చూడాలి