మొట్టమొదటి సారి డైనోసార్ కాలం నాటి ఒక కప్ప శిలాజాన్ని కనుక్కున్న సైంటిస్ట్ లు
డైనోసార్ లు భూమి మీద తిరిగిన అతిప్రాచీన జీవులు అంతే కాదు మనిషి తరువాత భూమిని ఎక్కువగా ఆక్రమించిన జీవులు కూడా ఇవే అని చెప్పుకోవాలి,
కానీ డైనోసార్ ల కు ఉన్న పేరు వల్లనో లేదంటే మర్రి చెట్టుకింద పెరిగే చెట్లకు పెద్దగా గుర్తింపు ఉండదు అనే నానుడి నిజమే అన్నట్టుగా 6 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్ ల గురించి ప్రపంచం మాట్లాడుకున్నంతగా అదే కాలం లో జీవించిన జీవుల గురించి మనకు పెద్దగా తెలియదు
కానీ ఇటీవలే northwest China లో జరిపిన తవ్వకాలలో డైనోసార్ శిలాజాలు బయటపడ్డాయి అయితే దానితో పాటు ఒక కప్ప అవశేషాలు కూడా బయటపడ్డాయి
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కప్ప కడుపులో గుడ్లు ఉన్నట్టుగా గుర్తించారు
అయితే ఈ కప్ప 100 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది అని తెలిసింది అంటే 10 కోట్ల సంవత్సరాల క్రితం జీవించినది గా గుర్తించారు
ఆ కాలాన్ని (Cretaceous) క్రెటీషియస్ పీరియడ్ గా పిలుస్తారు (145 million to 66 million years ago), ఆ కాలంలో డైనోసార్ లతో పాటు కప్పలు కూడా నివసించడం అనేది ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది,
ఎందుకంటే 10 కోట్ల సంవత్సరాల నుండి కప్పలు ఎలాంటి పరిణామం చెందకుండా అదే సహజ లక్షణాలతో ఇన్ని కోట్ల సంవత్సరాల పాటు మనుగడ సాగిస్తూ వొచ్చింది
మరొకవైపు mammals అంటే పాలు ఇచ్చే జంతువులు ఈ పది కోట్ల సంవత్సరాలలో ఎన్నో మార్పులు చెందుతూ వివిధ జీవులుగా పరిణామం చెందుతూ వొచ్చాయి
అయితే ఇప్పుడు కనుక్కున్న ఈ ఆడ కప్ప చనిపోవడానికి కారణం అది సంపర్కం లో ఉండగా మరణించినట్టు కనుక్కున్నారు
అంతేకాదు, ఒక కప్ప సంపర్కం జరపడానికి లేదా గుడ్లను పెట్టడానికి ఉండాల్సిన పరిణితి దీనికి లేదని అందుకే అది సంపర్కం జరుపుతుండగానే చనిపోయింది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు
రెగ్యులర్ గా నోటిఫికేషన్ పొందడానికి మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి Telegram channel Click