ఇస్రో గగన్ యాన్ విజయవంతం Gaganyan mission
గగన్ యాన్ మిషన్ గురించి ఇస్రో ఒక శుభవార్త చెప్పింది
డిసెంబర్ 18 న అంటే నిన్న నిన్న తెల్లవారుజామున 8.45 గంటలకి గగన్ యాన్ మిషన్ లో భాగంగా crew module అంటే వ్యోమగాములు ప్రయాణించే కేబిన్ ని భూమి నుండి 126 km ఎత్తుకు తీసుకెళ్లి సముద్రం లోకి విడిచిపెట్టారు,
అది బే అఫ్ బెంగాల్ లో శ్రీహరికోటకు 1600 km దూరం లో అండమాన్ దీవుల దగ్గర ల్యాండ్ అయ్యింది దాన్ని కాస్త గార్డ్ లు విజయవంతగా రెస్క్యూ చేసారు
అండమాన్ ఒక్కటే కాదు విశాఖపట్టణం లో కూడా ఈ రెస్క్యూ ప్రయోగాన్ని చేశారు
దాంతో పాటు ఆస్ట్రేలియా తో కూడా గగన్ యాన్ crew module ను recovery చేయడానికి ఒప్పందం చేసుకుంది
అయితే ఇన్ని ప్రదేశాలలో ఈ ప్రయోగం చేయడానికి కారణం gaganyan లో వెళ్లిన వ్యోమగాములు ఎక్కడైనా ల్యాండ్ అవ్వొచ్చు కాబట్టి వాళ్ళని సముద్రం లో వెతికి తీసుకొచ్చే పనిని అన్ని చోట్ల ఉండేవాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు
కానీ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వ్యోమగాములు ఆస్ట్రేలియా తీర ప్రాంతం లో ల్యాండ్ అవుతారు
లేకపోతే విశాఖపట్నంలో కానీ అండమాన్ తీరం లో కానీ ల్యాండ్ అవ్వొచ్చు దానికి సంబంధించి ఇప్పటికే వైజాగ్ లో రెస్క్యూ ప్రయోగాలు చేసారు నిన్న అండమాన్ లో కూడా రెస్క్యూ ప్రయోగం జరిగింది
ఈ ప్రయోగాన్ని re-entry అంటారు, దీని ద్వారా crew module యొక్క పారాచూట్ లు ఎంత తొందరగా తెరుచుకుంటున్నాయి, crew module ఎంత నెమ్మదిగా కిందకి దిగుతుంది ఏ డైరెక్షన్ లో వెళుతుంది, సముద్ర ఉపరితలానికి ఎంత వేగంగా వొచ్చి ఢీ కొడుతుంది
దానివల్ల crew module లో ఉండే వ్యోమగాములకు ఎలాంటి పరిస్థితులు కలుగుతాయి.
ఇలాంటివన్నీ పరీక్షిస్తారు
అయితే ఈ ప్రయోగం విజయవంతం అయ్యింది అని ఇస్రో తెలియజేసింది
అంతే కాదు తొందర్లోనే మనుషులు లేకుండా అంతరిక్షం లోకి గగన్ యాన్ మిషన్ ని లాంచ్ చేయడానికి GSLV MK-III రాకెట్ ని సిద్ధం చేస్తున్నారు
దానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి అని వాటి ఫోటో లను విడుదల చేసింది