శాస్త్రవేత్తలు కూడా చెప్పేలేకపోతున్న వింత Black hole మిస్టరీ
యూనివర్స్ అనేది మనం ఊహించినట్టుగా ఉండదు అని మరొకసారి రుజువు అయ్యింది
black హోల్స్ గురించి మనకు ఎంత తెలిసినా సరే వాటిని దగ్గర నుండి చూడకుండా మనం చేసిన పరిశోధనలు అన్ని కూడా వాటిని దగ్గర నుండి చూసిన రోజు పటాపంచలు అయిపోవొచ్చు
ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల దూరం లో ఉన్న బ్లాక్ హోల్స్ ని మనం ఎప్పటికి చేరుకోలేం ఉదాహరణకు మనకు అతి దగ్గరగా ఉన్న బ్లాక్ హోల్ (Gaia BH1) కూడా 1560 కాంతి సంవత్సరాల దూరం లో ఉంది దానిని 2022 లో కనిపెట్టారు
అలాంటి బ్లాక్ హోల్ దగ్గరికి కూడా మనిషి తన లైఫ్ టైం లో చేరుకోలేడు అలాంటి బ్లాక్ హోల్స్ గురించి విశ్వం లో ఒక ధూళి కణం లాంటి భూమి మీద ఉన్న
మనుషులు ఎన్ని సిద్ధాంతాలు రాసుకున్నా సరే ప్రతీ సారి బ్లాక్ హోల్స్ కొత్త గా విశ్వం లో దర్శనమిస్తున్నాయి వాటి గురించిన కొత్త రహస్యాన్ని మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి
ఇటీవలే ఒక కొత్త బ్లాక్ హోల్ ను ఖగోళశాస్త్రవేత్తలు కనుక్కున్నారు
మన సూర్యుడి కంటే 2 కోట్ల రెట్లు పెద్దదిగా ఉన్న ఒక బ్లాక్ హోల్ అంతరిక్షం లో ముందుకు వెళ్తున్నట్టు కనుక్కున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ బ్లాక్ వెనకాల కొన్ని కోట్ల నక్షత్రాలు తోకలా వెళ్తున్నట్టు హవాయి లోని Keck telescope తో అంతరిక్షం లో చేసిన పరిశీలనలో తేలింది
ఆ నక్షత్రాల సముదాయం ఎంత పెద్దది అంటే అది మన milkyway గాలక్సీ కంటే రెండింతలు పెద్దది అంటే 2లక్షల కాంతి సంవత్సరాల వెడల్పు తో ఉంది
అయితే దీనికి కారణం ఆ బ్లాక్ హోల్ తన గాలక్సీ నుండి తప్పించుకొని వెళ్తున్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు
బ్లాక్ హోల్స్ సాధారణంగా గాలక్సీ మధ్య భాగం లో ఉంటాయి, తన దగ్గరికి వొచ్చిన నక్షత్రాలను ఒక్కొక్కటిగా మింగుతూ ఉంటాయి
బ్లాక్ హోల్స్ అనేవి సాధారణంగా గాలక్సీ ని విడిచిపెట్టి బైటికి రావు కానీ ఈ ఈ బ్లాక్ హోల్ బైటికి రావడంతో పాటు దాని గాలక్సీ లోని నక్షత్రాలను కూడా తన వెంట తీసుకొని రావడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది
అదేంటంటే
ఇప్పుడు కనుకున్న బ్లాక్ హోల్ పూర్వం ఇంకొక బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉండేది అంటే అదొక జంట Black hole system
అయితే ఒక Black hole చుట్టూ ఇంకొక బ్లాక్ హోల్ తిరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకొక Black hole వొచ్చి ఉండొచ్చు
విశ్వం లో ఒక నియమం ఉంది రెండు వొస్తువులు ఒకదాని చుట్టూ ఒకటి అతి దగ్గరగా orbit చేస్తున్నప్పుడు వాటి మధ్యలో ఇంకోక వొస్తువు వొస్తే
అప్పుడు ఆ మూడు వొస్తువుల ఆర్బిట్స్ (కక్ష్యలు ) గందరగోళంగా మారిపోతాయి, అప్పుడు ఏ వొస్తువు ఎటు వైపుకు వెళ్తుందో చెప్పలేం దీన్నే ఖగోళ శాస్త్రం లో
3 బాడీ ప్రాబ్లెమ్ అంటారు,
ఇప్పుడు కనిపిస్తున్న ఈ Black hole విషయం లో కూడా అది జరగడం వల్లనే అది దాని గాలక్సీ నుండి ఇలా బయటకు తోసివేయబడింది అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు
కాకపోతే ఆ Black hole గురుత్వాకర్షణకు లోనై దాని చుట్టూ ఉన్న నక్షత్రాలు కూడా Black hole వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి
ఇలాంటి ఒక సంఘటనను శాస్త్రవేత్తలు గమనించడం ఇది మొదటి సారి,
దింతో పాటు శాస్త్రవేత్తలు ఇంకొక వింత విషయాన్నీ కూడా గుర్తించారు
Rogue Planets Mystery
మనకు తెలుసు Nebula లు అనేవి విశ్వంలోని అత్యంత అద్భుతమైనవి అని, అయితే ఆ nebula లే విశ్వం లో గాలక్సీ లు తయారవ్వడానికి కారణం అవుతాయి
అంటే నక్షత్రాల పుట్టుక వీటి నుండే జరుగుతుంది
అలాంటి మనకు తెలిసిన ఒక nebula “Orion Nebula” ఇది మన భూమికి 1,344 కాంతి సంవత్సరాల దూరం లో ఉంది
అయితే ఈ nebula లో 500 కు పైగా గ్రహాలు ఒక ప్రవాహం లా వెళ్తున్నట్టు జేమ్స్ వెబ్ టెలీస్కోప్ ద్వారా చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు
సాధారణంగా గ్రహాలు అనేవి నక్షత్రాల చుట్టూ మాత్రమే తయారవుతాయి నక్షత్రం చుట్టూనే ఆర్బిట్ చేస్తాయి కానీ
నక్షత్రం లేని గ్రహాలు కూడా విశ్వం లో ఉంటాయి అని కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు కనుక్కున్నారు వాటినే rogue ప్లానెట్స్ అంటారు
ఇవి ముక్యంగా బ్లాక్ హోల్ దగ్గర కానీ nebula లో కానీ తయారవుతాయి అని సైంటిస్ట్ ల అంచనా, లేకపోతే కొన్ని గ్రహాలు వాటి నక్షత్రాల నుండి విడిపోయి అంతరిక్షం లోకి తోసివేయబడ్డప్పుడు మాత్రమే ఇలాంటి rogue ప్లానెట్స్ మనకు కనపడతాయి అని కూడా కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం
కానీ వాటి పుట్టుకకు అసలైన కారణం మాత్రం ఇప్పటివరకు కనుక్కోలేదు,
అలాంటి 500 వందలకు పైగా rogue గ్రహాలు orion nebula లో ఒక ప్రవాహం లా వెళ్లడం నిజంగా ఒక వింతగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు
అందులో 80 గ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటి ఒకటి ఆర్బిట్ చేస్తున్నట్టు గుర్తించారు, ఇవన్నీ దాదాపు మన Jupiter సైజు లో ఉన్నట్టు తెలుస్తుంది
అయితే 500 వందలకు పైగా గ్రహాలు ఇలా ఎందుకు వెళ్తున్నాయి అని చెప్పడానికి సైంటిస్ట్ ల దగ్గర సమాధానం లేదు
కొన్ని సిద్ధాంతాల ప్రకారం కదిలే నక్షత్రాలు ఇంకొక సౌరమండలం నుండి వెళ్ళినప్పుడు అందులోని గ్రహాలు అన్ని చెల్లాచెదురై ఇలా rogue ప్లానెట్స్ గా మారతాయి అని తెలుస్తుంది
సైంటిస్ట్ ల ప్రకారం ఇలాంటి rogue ప్లానెట్స్ మన గాలక్సీ లో కొన్ని ట్రిలియన్ ల వరకు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు దీనికి కారణం విశ్వం పుట్టిన మొదట్లో సౌరవ్యవస్థలు గందరగోళంగా ప్రవర్తించి ఉండాలి కానీ వాటి గురించి చెప్పే సరైన సిద్ధాంతాలు ఇప్పుడు ఖగోళశాస్త్రం లో లేవు
అందుకే మన శాస్త్రవేత్తలకు ఈ సంఘటనలు ఒక పెద్ద మిస్టరీ లా మారిపోయాయి
Nice information…… we have a lot of unexplored information in our 6 th to 12 th education books. If you can explore, you have a good chances to grow up.