13 వేల ఏళ్ళ క్రితం నివసించిన Ancient Americans టన్నుల కొద్దీ mammoth ఏనుగుల మాంసం తిని బ్రతికేవారట
పూర్వకాలం లో అమెరికా లో నివసించిన Clovis అనే జాతికి చెందిన మనుషులు బ్రతకడానికి mammoth లని వేటాడి తినేవారు అని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు
కానీ శాస్త్రవేత్తలు ఎలా కనుక్కోగలిగారు అనేది ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది
13000 వేల సంవత్సరాల క్రితం నివసించిన 18 నెలల బాలుడి అస్థిపంజరం అమెరికా లోని మోంటానా అనే ప్రాంతం లో లభించాయి
దీని ద్వారా ఆ కాలంలో మామొత్ ఏనుగుల మాంసాన్ని వాళ్ళు తినేవారు అని కనిపెట్టారు
అయితే ఆ శిశువు చనిపోయిన నాటికి 18 నెలలు మాత్రమే ఉన్నాయి కానీ 18 నెలల బాబు ఏనుగుల మాంసం ఎలా తిన్నాడు
ఆ కాలంలో చిన్నపిల్లలకు కూడా మాంసం తినిపించేవారేమో అని అనిపిస్తుంది, కానీ సైంటిస్ట్ లు చేసిన పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఆ మామొత్ ల మాంసం ఆ బాలుడు తిన్నది కాదు తన తల్లి ఆ మాంసాన్ని ప్రతీ రోజు తిని జీవించేది
ఆ విషయం సైంటిస్ట్ లు ఎలా కనుక్కున్నారు అంటే
అమెరికా లో దొరికిన ఆ శిశువు యొక్క ఎముకలతో isotope analysis అనే ఒక పరీక్ష చేశారు, ఈ పరీక్ష సాధారణంగా ఎముక మీద దంతాల మీద చేస్తారు దీని ద్వారా పూర్వకాలం లోని జంతువులు కానీ మనుషులు కానీ ఎలాంటి ఆహారాన్ని తిని జీవించేవారో తెలుస్తుంది
ఆ బాలుడి ఎముకల మీద ఈ పరీక్ష చేసినపుడు ఆ ఎముకలలో తన తల్లిపాల వల్ల వొచ్చిన isotopes ను గుర్తించారు
అంటే అప్పటికి ఆ బాలుడు తన తల్లి దగ్గర పాలు తాగుతూనే ఉన్నాడు
దానివల్ల ఆ బాలుడి తల్లితో పాటు అప్పుడు నివసించిన మనుషులు అందరూ పూర్తిగా mammoth లని వేటాడి తినేవారు అని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు
ఒక మామొత్ దాదాపు 7,300 కిలోల వరకు బరువు ఉంటుంది. కాబట్టి ఒక్క మామొత్ ని చంపినా సరే వాటి మాంసం కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు తినేవారు
అలా వారి ఆహారం లో పూర్తిగా మామొత్ ల మాంసమే ఉన్నట్టు తెలుస్తుంది
ఈ mammoth లు ఇప్పుడు అంతరించిపోయాయి అని మనకు తెలుసు దానికి కారణం 13 వేల సంవత్సరాల క్రితం వాటిని వేటాడి చంపి తినేవారు కాబట్టే అవి చరిత్ర లో నుండి కనుమరుగయ్యాయి
ఇవి దాదాపు 26 లక్షల సంవత్సరాల క్రితం నుండి జీవించినట్టు ఆధారాలు ఉన్నాయి, ఇవి ఎక్కువగా యూరోప్ లో, ఉత్తర ఆసియా లో , ఉత్తర అమెరికా లో నివసించేవి, వాటి శిలాజాలు దొరికిన ప్రాంతాలను బట్టి ఒకప్పటి మంచుయుగం లో ఇవి ఎక్కువగా జీవించాయి
వీటికి ఉండే దట్టమైన పొడవైన వెంట్రుకల వల్లనే మంచుయుగం లో మనుగడ సాగించగలిగాయి
దాదాపు 11 వేల సంవత్సరాల క్రితం ఇవి అంతరించాయి.
mammoth లను తిన్న పురాతన అమెరికన్లు ఎవరు?
Clovis జాతికి చెందిన మనుషులు 13,000 నుండి 12,700 వందల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికా లో జీవించేవారు
మొదట్లో వీళ్ళనే మొట్టమొదటి పురాతన అమెరికన్లు గా భావించేవారు
కానీ వీళ్ళకంటే పూర్వం 23,000 వేల సంవత్సరాల క్రితం మొట్టమొదటి అమెరికన్లు జీవించారని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు
అయితే mammoth లను తినడం వల్లనే ఆ కాలంలో లోని మొదటి మానవులకు ప్రోటీన్లు కొవ్వు పదార్దాలు లభించాయని,
మనుషులు ఇంకా పుష్టిగా తెలివిగా మారడానికి అవి కూడా ఒక కారణం గా చెప్తున్నారు
mammoth లను వేటాడుతూ clovis జాతి ప్రజలు ఉత్తర అమెరికా నుండి దక్షిణ అమెరికా వరకు వలస వొచ్చారని, దానికి కారణం
వలస రావడానికి చిన్న జంతువుల మీద ఆధారపడి వెళ్ళలేరు, పెద్ద జంతువుల మాంసం తోనే కొన్ని సంవత్సరాల పాటు వలస కొనసాగుతుంది
అయితే ఈ clovis జాతి మనుషులు కేవలం mammoth లనే కాకుండా elk మరియు bison జంతువులను కూడా తిన్నారని
తెలిసింది. వారి ఆహారం లో mammoth లు 40 శాతం ఉంటె మిగతా 60 శాతం చిన్న చిన్న జంతువుల మాంసం ఉండేవి అని కనుక్కున్నారు.
Published on Science advances
Also Read : నార్వే లో మూడువేల ఏళ్లనాటి చిన్నపిల్లల స్మశానం
Wow!chala baaga vivarana icharu Rakesh garu .Great work .Elanti samacharam ekkada dorukutundi ekkada nunchi tisukuntaru??