చెస్ గేమ్ లో విశ్వ విజేతగా నిలిచిన గుకేశ్
ప్రపంచం లో తెలివైన ఆటగా చెస్ గేమ్ కి పేరు ఉంది అలాంటి ఆటకు పుట్టిల్లు మన భారతదేశమే కానీ
ప్రపంచం స్థాయిలో జరిగే World Chess Championship లో మాత్రం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ట్రోఫీ లు మనం గెలుచుకోలేదు
మన భారత దేశం నుండి విశ్వనాథ్ ఆనంద్ మాత్రమే ఇప్పటివరకు World Chess Championship గెలిచిన మొదటి భారతీయ చెస్ ఆటగాడు
ఆ తరువాత 2024 డిసెంబర్ 12 వ తేదీన సింగపూర్ లో జరిగిన World Chess Championship లో D గుకేష్ మొదటి సారి ఛాంపియన్ గా గెలిచాడు
ఇక్కడ ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే ఇతని వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే
ఇంతచిన్న వయసులో చెస్ ఛాంపియన్ గా నిలవడం నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి
గుకేష్ కి తెలుగు రాష్టం తో సంబంధాలు ఉన్నా సరే అతను పుట్టి పెరిగింది తమిళనాడులోనే,
అక్కడే అతనికి కావాల్సిన ప్రోత్సాహకాలు కూడా అందాయి
అందుకే ఇప్పడు తమిళనాడు ప్రభుత్వం అతనికి 5 కోట్ల రూపాయల బహుమతిని కూడా ప్రకటించింది
మరొకవైపు ఆంధ్రప్రదేశ్ CM చంద్రబాబు ట్విట్టర్ లో తెలుగు బాయ్ గుకేష్ కి అభినందనలు చెప్పడం ఇంకోవైపు
తమిళనాడు CM కూడా ట్విట్టర్ బహుమతి ప్రకటించడం తో
నెటిజన్లు ఇరు రాష్ట్రాల సీఎం ల మీద కామెంట్ లు చేస్తున్నారు గెలిచాక మావాడు అని చెప్పుకోవడం వీళ్ళకి అలవాటే కదా అని,
ఏదేమైనా 18 ఏళ్ళ వయసులో ప్రపంచ స్థాయి పోటీ లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌తో చెస్ పోటీ లో పాల్గొని 14వ రౌండ్‌లో గెలిచాడు
ఇంకొక యాదృచ్చికం ఏంటంటే గుకేశ్ వయసు 18 ఏళ్ళు అయితే ఇప్పడు జరుగుతున్న ఛాంపియన్ షిప్ కూడా 18 వ ప్రపంచ పోటీలు
అంటే 18 ఏళ్ళ వయసులో 18 వ ఛాంపియన్ గా గూకేష్ నిలిచాడు
చెస్ లో గెలిచినందుకు అతనికి 11.45 కోట్ల ప్రైజ్ మనీ వొచ్చింది దాంతో పాటు తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న 5 కోట్లు,
ఒక దెబ్బతో గూకేష్ కోటీశ్వరుడు కూడా అయిపోయాడు
he is from the telugu family but apparently he got major support from Tamil Nadu.